హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మహిళ‌లు చేయించుకోవాల్సిన టెస్టులివే

మహిళలు 30 ఏళ్ల దాటిన తర్వాత ఆరోగ్య రక్షణ కోసం కొన్ని వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. అలాగే థైరాయిడ్, రక్తహీనత, ఎముకల బలాన్ని తెలుసుకోవడానికి బోన్ డెన్సిటీ (DEXA) పరీక్షలు అవసరం. ఏడాదికి ఒకసారి పూర్తి శరీర ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి.