WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు, కోలాటాలతో సందడి చేశారు. మహిళా అధికారులు పాడిన బతుకమ్మ పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీవో శేషాంజన్ స్వామి, ఏపీవో సుశీల్ కుమార్, గ్రామ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ పాటలతో మార్మోగిన ఎంపీడీవో కార్యాలయం


