హైదరాబాద్: 28°C
తెలంగాణ

15, 16న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

NZB: ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్‌ఓ) కేటాయించిన కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.