హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NGKL: తిమ్మాజిపేట మండల కేంద్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతులు చేపట్టిన మహాధర్నా లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.