హైదరాబాద్: 28°C
క్రైమ్

ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి, 19 మందికి అస్వస్థత

TG: మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో ఆహారం కలుషితమై యువకుడు మృతి చెందాడు. మరో 19 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుడు సాయిరామ్(19)గా గుర్తించారు. బాధితులందరికీ నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే రెండ్రోజుల ముందు రెస్టారెంట్‌లో బాధితులు భోజనం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.