హైదరాబాద్: 28°C
క్రైమ్

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్రలోని నలాసోపారాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగాయి. 13వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతిచెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. మరో 40 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఆరు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.