ATP: అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వీల్ చైర్ల కొరతపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ వెంటనే స్పందించారు. విభిన్న ప్రతిభావంతుల అభ్యర్థన మేరకు 8 వీల్ చైర్లను మంజూరు చేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఈ చైర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మల్లేశ్వరి, ఆర్ఎంఓ డా. హేమలత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రికి 8 వీల్ చైర్ల మంజూరు


