హైదరాబాద్: 28°C
క్రైమ్

పాతబస్తీలో అగ్నిప్రమాదం

TG: పాతబస్తీలో ఫర్నిచర్ వర్క్‌షాపుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా విస్తరించడంతో చుట్టుపక్కల ఉన్న ఐదు ఫర్నిచర్ వర్క్‌షాపులకు మంటలు వ్యాపించాయి. అక్కడ నిల్వ ఉంచిన ఫర్నిచర్, ఇతర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.