హైదరాబాద్: 28°C
క్రైమ్

అస్సాంలో భారీగా డ్రగ్స్ సీజ్

అస్సాంలోని కామ్‌రూప్ జిల్లాలో రూ.10 కోట్ల విలువైన 40 వేల యబా మాదక ద్రవ్యాల మాత్రలను STF పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిజోరం నుండి అమింగాన్ మీదుగా తరలిస్తుండగా పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. మెథామ్‌ఫెటమైన్, కెఫీన్‌ల మిశ్రమంతో తయారుచేసే ఈ డ్రగ్స్‌ను ఆగ్నేయాసియా దేశాల్లో అక్రమంగా వినియోగిస్తుంటారు.