హైదరాబాద్: 28°C
క్రైమ్

భర్తను కర్రతో కొట్టి చంపిన భార్య

TG: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండాలో దారుణం జరిగింది. భర్త భగవాన్‌ను కర్రతో కొట్టి భార్య రాజేశ్వరి చంపింది. దంపతుల మధ్య కుటుంబకలహాలతో హత్య జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.