TG: కామారెడ్డిలోని రైల్వే స్టేషన్ వద్ద ఎక్సైజ్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగావళి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో తరలిస్తున్న 18 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ఎండు గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్


