హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల పర్యటన

NDL: నేడు డోన్ పట్టణంలో ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటిస్తున్నట్లు శనివారం టీడీపీ కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు. పట్టణ సమీపంలోని హంద్రీనీవా కాలువ నుంచి ఉడుములపాడు చెరువుకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నీటిని విడుదల చేస్తారు. అనంతరం ఆయన రైతుల సమస్యలపై వారితో చర్చిస్తారు.