హైదరాబాద్: 28°C
క్రైమ్

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం

TG: క్రిప్టో కరెన్సీ పేరుతో పలువురు భారీ మోసానికి పాల్పడ్డారు. పెట్టుబడులు రెట్టింపు చేస్తామంటూ ప్రజలకు టోకరా వేశారు. ఐటీసీ గ్లోబల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి ఐదుగురి నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారు. ఆరుగురిపై కేసు నమోదు చేయగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల ఆస్తులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.