హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగన్నాధపల్లిలో భూ రీ-సర్వేపై అవగాహన సదస్సు

WGL: రాయపర్తి మండలంలోని జగన్నాధపల్లిలో బుధవారం భూ రీ-సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ పాల్గొని భూముల హద్దుల నిర్ధారణ, భూ రికార్డుల పరిశీలన, సమస్యల పరిష్కారంపై ప్రజలకు వివరించారు. భూ రీ-సర్వేతో రికార్డుల్లో పారదర్శకత పెరుగుతుందని, రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.