MNCL : లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరం పోస్టర్ను పట్టణ సీఐ బాన్సీలాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రక్తదానం ప్రాణాలను నిలిపే పవిత్రమైన కార్యమని, ఆపదలో ఉన్నవారికి రక్తం అందించి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాడి తిరుపతి, నిమ్మల సాగర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మెగా రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరణ


