హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: కోటబొమ్మాలి గ్రామ దేవత కొత్తమ్మ తల్లి 101వ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలమాలలు, ఆభరణాలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.