హైదరాబాద్: 28°C
క్రీడలు

సెలక్షన్లపై ఉమేశ్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

ఫిట్‌నెస్‌ ఉంటే వయసు సమస్య కాదని, ప్రదర్శనే ముఖ్యమని ఉమేశ్‌ యాదవ్‌ అన్నాడు. ఆటగాళ్లకు ఆశలు కల్పించకుండా, ఫామ్‌ కోల్పోతే ముసుగులో గుద్దులాట లేకుండా 'నీ బౌలింగ్‌లో పస తగ్గింది, నువ్విక దయచేయవచ్చు' అని సెలక్టర్లు నేరుగా స్పష్టం చేయాలని అభిప్రాయపడ్డాడు. అలా చెబితే ఆటగాళ్లు తమ భవిష్యత్‌ ప్రణాళికలు మార్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.