హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటలను పరిశీలనలో సీపీఎం నాయకులు

NRPT: ఎల్‌నీనో ప్రభావంతో ఎండిపోయిన పంటలను వ్యవసాయ అధికారులు గుర్తించి రైతులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని సీపీఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకట రామిరెడ్డి కోరారు. బుధవారం సీపీఎం నాయకులతో కలిసి ఆయన ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి, బిజ్వార్ గ్రామాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. భూగర్భ జలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యాక్యానించారు.