హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్యం, పరిశుభ్రమైన పరిసరాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.