హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య ఖర్చుల కోసం ఎల్‌ఓసీ అందజేత

BDK: మణుగూరు మండలం సుందరయ్య నగర్‌కు చెందిన దొమ్మేటి ఏడుకొండలుకు వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్‌ఓసీని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.