హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రావెల్ తవ్వకాలపై తహసీల్దార్‌కు ఫిర్యాదు

BDK: చర్ల మండలం లక్ష్మీ కాలనీలో ప్రభుత్వ గ్రావెల్ గుట్ట నుంచి అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపి తరలిస్తున్నారనే ఆరోపణలపై వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరావు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తవ్వకాల కారణంగా కస్తూరిబా పాఠశాల ప్రహరీ, తాగునీటి పైప్‌లైన్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.