హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటిని విడుదల చేయించిన BRS నేతలు!

KNR: చొప్పదండి SRSP కాలువ రెగ్యులేటర్ వద్ద రైతులతో కలిసి MLA గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్‌‌లు బుధవారం నిరసన తెలిపారు. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు విడుదల చేసి తమకే ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే నీటిపారుదల అధికారులు స్పందించి నీటిని విడుదల చేయడంతో ఆందోళన విరమించారు.