BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి సన్నిధిలో శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన బుధవారం అమ్మవారు లలితాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు ప్రాతఃకాల పూజలు, సహస్రనామార్చన, చతుష్షష్టి ఉపచార పూజ, నవావరణ పూజలు, కుంకుమార్చన చేసి తీర్థప్రసాదాలు పంచారు. ఆలయ అధికారులు, భక్తులు భారీగా పాల్గొన్నారు.
తెలంగాణ
లలితాదేవిగా పర్వతవర్ధిని అమ్మవారు


