హైదరాబాద్: 28°C
తెలంగాణ

తలమడుగు పోలీస్ స్టేషన్‌ తనిఖీల్లో ఎస్పీ

ADB: తలమడుగు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.వీపీవో వ్యవస్థ బలోపేతం, రౌడీషీటర్ల నెలవారీ సమీక్ష, ప్రతి సాయంత్రం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయాలని ఆదేశించారు. గంజాయి సమాచారం ఇస్తే నగదు బహుమతి ఇస్తామన్నారు. పెండింగ్ కేసుల్లో చార్జిషీట్లు త్వరగా వేయాలన్నారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ రహీం పాషా ఆయన వెంట ఉన్నారు.