హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారం రోజులుగా వెలగని వీధిలైట్లు

ASR: అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ దుమ్మగూడ కాలనీలో వారం రోజులుగా వీధిలైట్లు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఉపసర్పంచ్ భగత్‌రామ్ తెలిపారు. సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్న గ్రామంలో పాములు, తేళ్ల భయం ఉందన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయకపోతే పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.