హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు CMRF చెక్కులు పంపిణీ

ప్రకాశం: CMRF కింద 93 మందికి రూ.59.15 లక్షల చెక్కులను బుధవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పంపిణీ చేశారు. మార్కాపురం టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 87 మందికి రూ.48.49 లక్షలు, 6 ఎల్ఓసీలకు రూ.10.66 లక్షలు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 1200 మందికి రూ.11 కోట్లు ఇచ్చామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు.