హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కులవివక్షకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి'

WNP: పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళిత కుటుంబానికి ఆలయ ప్రవేశ నిరాకరణను పట్టణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గంధం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కులవివక్ష పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.