హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాలిపేరు బ్రిడ్జి వద్ద యువకుడు గల్లంతు

BDK: చర్లలో భవాని మాల ధరించిన ఐదుగురు యువకులు స్నానం చేసేందుకు తాలిపేరు బ్రిడ్జి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు గల్లంతైనట్లు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న ఎస్సై నర్సిరెడ్డి వెంటనే స్పందించి, పడవ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, సిబ్బంది గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.