హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధి పనుల ప్రారంభం'

GDWL: మల్డకల్ మండలం నేతోనిపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేడు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి భవిష్యత్తులోనూ తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.