హైదరాబాద్: 28°C
తెలంగాణ

బహిరంగంగా చెత్త వేస్తే చర్యలు: డిప్యూటీ కమిషనర్

MDCL: హైదర్‌నగర్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి పారిశుధ్య తనిఖీలు నిర్వహించారు. రామ్ నరేశ్ నగర్‌లో ఇంటింటికీ చెత్త సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నివాసితులంతా చెత్తను సేకరణ ఆటోకే అందజేయాలని విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.