హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ వరద కాలువకు నీటి విడుదల

NZB: నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువకు బుధవారం నీటి విడుదల ప్రారంభించారు. రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈ వి. జగదీష్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,079 అడుగుల నీటిమట్టం ఉందని, ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.