హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు నవదుర్గ మాత ఆలయంలో కల్యాణ మహోత్సవం

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గ మాత ఆలయంలో గురువారం ఉదయం 11.30 గంటలకు శ్రీ దుర్గా–మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. మహాదేవి మాతాజీ ఆశీర్వాదాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు జరగనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.