హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు సభ్యురాలిపై వేధింపులు.. కేసు నమోదు

KMR: పాల్వంచ మండలం ఫరీద్‌పేట్‌లో 1వ వార్డు సభ్యురాలు రమాదేవిపై వేధింపులకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామానికి చెందిన నలుగురిపై మాచారెడ్డి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నలుగురు వ్యక్తులు తనను వేధిస్తున్నారని, దాడికి యత్నించారని బాధితురాలు మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.