హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, హౌసింగ్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.