GDWL: గద్వాల జిల్లా పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు ఎర్రవల్లి చౌరస్తాలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి ఆహ్వానించారు. హరీశ్రావు పర్యటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ
హరీష్ రావుకు ఎమ్మెల్యే స్వాగతం


