హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రాహ్మణ వెల్లెంలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

NLG: నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో ఆదర్శ్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. అలాగే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.