హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

KMM: కొత్త బస్టాండ్ పరిసరాల్లో ఈ నెల 11న మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి ఆచూకీ కోసం ఎవరూ ముందుకు రాకపోవడంతో టూ టౌన్ పోలీసులు పోస్టుమార్టం చేయించారు. అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ అన్నం శ్రీనివాసరావు సహకారంతో ప్రకాశ్‌నగర్ వైకుంఠధామంలో దహన సంస్కారాలు నిర్వహించారు.