KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.కోటి నిధులతో కొనుగోలు చేసిన జేసీబీ, లాడర్ యంత్రాలను బుధవారం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. D.y మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. నగర విస్తరణకు అనుగుణంగా పారిశుధ్య నిర్వహణ, పనులు వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు.
తెలంగాణ
పారిశుధ్య నిర్వహణకు కొత్త యంత్రాలు


