హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల కష్టాన్ని గుర్తించారు: ఐఎన్టీయూసీ

MNCL: ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషితో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల కష్టాన్ని గుర్తించి చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుందని కేంద్ర కమిటీ నాయకులు కాంపల్లి సమ్మయ్య, రాంశెట్టి నరేందర్ అన్నారు. బుధవారం మందమరి ఏరియా కేకే 5 గనిలో వారు మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి తగ్గినప్పటికీ 34 శాతం లాభాల వాటా ప్రకటించడం హర్షణీయమన్నారు.