ఆసిఫాబాద్లోని ప్రేమల గార్డెన్స్లో అక్టోబర్ 15న కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ఆసిఫాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు మిలింద్ తెలిపారు. మేళాలో విత్తనాలు,ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల కోసం ఎగ్జిబిషన్ కూడా ఉంటుందన్నారు. రైతులందరూ అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: అక్టోబర్ 15న కిసాన్ మేళా!


