హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేతేపల్లిలో బీఆర్ఎస్ నాయకుడి కుమారుడు మృతి

WNP: పాన్‌గల్‌ మండలం కేతేపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మీనిగ శ్రీనివాస్ నాయుడు తనయుడు సురేందర్ నాయుడు (25) అనారోగ్యంతో మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏకైక కుమారుడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. సురేందర్ మృతిపై గ్రామస్థులు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.