హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు NTR భవన్‌లో బతుకమ్మ వేడుకలు

HYD: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని టీడీపీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో నేడు బంజారాహిల్స్‌లోని NTR భవన్‌లో ‘గ్రాండ్ బతుకమ్మ వేడుకలు–2026’ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గం.లకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం చాటిచెప్పే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.