హైదరాబాద్: 28°C
వ్యాపారం

‘ఎలాన్ మస్క్ కంటే నేనే ముందున్నా’

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల అనుమతుల రేసులో ఎలాన్ మస్క్ కంటే తానే ముందున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. ఐదేళ్ల క్రితమే దరఖాస్తు చేశామని, మూడేళ్లుగా గ్రౌండ్ నెట్‌వర్క్ సిద్ధంగా ఉన్నా ఇంకా అనుమతులు రాలేదన్నారు. భద్రతాపరమైన క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నామన్నారు. మస్క్ కంటే కొద్దిరోజుల ముందైనా తమకు అనుమతిస్తే సంతోషిస్తామన్నారు.