NRPT: ఊట్కూర్ మండలం అమీన్పూర్ గ్రామానికి చెందిన అదృశ్యమైన రైతు నర్సప్ప ఆచూకీని గుర్తించి బుధవారం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ఈ నెల 9న వ్యవసాయ కూలీల విషయంలో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన నర్సప్ప మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయనను స్వగ్రామానికి తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు.
తెలంగాణ
అదృశ్యమైన రైతు ఆచూకీ లభ్యం


