హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్వతగిరి మార్కెట్ యార్డులో సీసీ పనులు ప్రారంభం

WGL: పర్వతగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు బుధవారం ప్రారంభించారు. పనులు పూర్తయితే పంటల రవాణా సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో బురద సమస్య తగ్గనుంది. ఈ కార్యక్రమంలో ఎనుమాముల మార్కెట్ ఛైర్‌పర్సన్ పులి ప్రియాంక అనిల్, పీఏసీఎస్ ఛైర్మన్ పిన్నింటి అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు.