హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా ట్రస్ట్స్‌లో ముదిరిన బోర్డు వివాదం!

టాటా ట్రస్ట్స్ బోర్డు వివాదం ముదురుతోంది. సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్(SDTT) పాలనపై ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్.. మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ ఛైర్మన్ నోయల్ టాటా, ఆయన కుమారుడు నెవిల్ టాటా బాంబే హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. వారం క్రితం ముంబై సివిల్ కోర్టులోనూ వీరు కేవియట్ వేశారు.