హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలి'

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు బుధవారం ముట్టడించారు. రైతులకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు.