హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాంతీయ విభేదాలతో తెలంగాణకు నష్టం: గుత్తా

NLG: నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రాంతీయ విభేదాలతో తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. విభేదాలు సృష్టించడం కాకుండా జిల్లాల అభివృద్ధిపై నేతలు ఫోకస్ చేయాలని సూచించారు.