హైదరాబాద్: 28°C
తెలంగాణ

కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి: డాక్టర్ అశోక్

WGL: జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని ఆత్మహత్యల నివారణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ సూచించారు. బుధవారం నర్సంపేట పట్టణంలో స్వయంకృషి సంస్థ ఆధ్వర్యంలో ఆయన రచించిన ‘నిలిచి గెలిస్తేనే ఘనత’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్య ఆలోచనలతో బాధపడేవారికి సమాజం అండగా నిలవాలని కోరారు.