హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీఐ అమలులో సూర్యాపేటకు రాష్ట్రస్థాయి గుర్తింపు

SRPT: సమాచార హక్కు చట్టం అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా సూర్యాపేట నిలవడంపై ఎస్పీ కె.నరసింహ ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నందాల్ పవార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పారదర్శక పాలన, జవాబుదారీతనంలో జిల్లా సాధించిన గుర్తింపు అభినందనీయమని పేర్కొన్నారు.